టాలీవుడ్‌లో భారీగా తెరకెక్కుతున్న చిత్రం SSMB29 పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నందున ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సినిమా పూర్తయి రిలీజ్ అయ్యే సమయానికి గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన రెస్పాన్స్ రాబట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రాజమౌళి స్ట్రాటెజీకి తగ్గట్టుగా ఇప్పటి వరకు సినిమా నుంచి ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాలేదు. అయితే ఇటీవల ఫస్ట్ లుక్‌ని నవంబర్‌లో విడుదల చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్‌లో హైప్ పెరిగింది. అంతేకాకుండా ఆ ఫస్ట్ లుక్‌ని హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
