తాజాగా టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ హిట్ సినిమాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సినిమా “దేవర” కూడా ఒకటి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా తోనే హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా విలన్ గా నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాతో పరిచయం అయిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా సైఫ్ పై ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.తను నిజంగా రెండు కత్తి పోట్లకి గురయ్యారు అనే షాకింగ్ న్యూస్ ఇపుడు సినీ వర్గాలను వణికిస్తుంది. అయితే ఈ గురువారం ఉదయం 2 గంటల 30 నిమిషాల సమయంలో తను ముంబై లోనే తన ఇంట్లో ఉండగానే ఈ దాడికి లోనయినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో ఎవరో తన ఇంట్లోకి దొంగతనం చేసేందుకు చొరబడగా సైఫ్ అడ్డుకునే యత్నంలో అతడు తనపై హత్యాయత్నం చేసినట్టు బాలీవుడ్ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దీంతో తనని మూడున్నర సమయంలో అలా కుటుంబీకులు లీలావత్ హాస్పిటల్ కి తరలించారట. ప్రస్తుతం ఈ కేసు విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారట. అయితే ప్రస్తుతం సైఫ్ ప్రాణాలకు హాని లేదని తెలుస్తోంది.