వైరల్‌ గా అట్లీ రివ్యూ!

Saturday, January 18, 2025

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే పుష్ప గాడి రూలుతో మొత్తం దేశం ఊగూతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు సినిమాతో పాటు అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ని మెచ్చుకుంటున్నారు.

ఇక తాజాగా అయితే కోలీవుడ్ యంగ్ అండ్ మాస్ కమర్షియల్ సినిమాల డైరెక్టర్‌ సాలిడ్ రివ్యూ తీసుకొచ్చాడు. మొట్ట మొదటగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ వావ్ అల్లు అర్జున్ సార్ మీ పెర్ఫామెన్స్ అవుట్ స్టాండింగ్ నిజంగా నా హృదయానికి హత్తుకుంది. మరో బ్లాక్ బస్టర్ కొట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ఎంతో హార్డ్ వర్క్ చేసిన సుకుమార్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం చిత్ర యూనిట్ కి అలాగే స్పెషల్ మెన్షన్ గా రష్మికా  పెర్ఫామెన్స్ తో బీస్ట్ లా కనిపించారు. ఫహద్ ఫాజిల్ కోసం కూడా తాను పాజిటివ్ గా చేసిన పోస్ట్ ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది. మరి ఆల్రెడీ బన్నీ, అట్లీ కాంబోలో ఓ సినిమా ఉందని ఎప్పుడు నుంచో రూమర్స్ వినపడుతున్నాయి. మరి ఈ సమయంలోనే ఆ సినిమా కూడా అనౌన్స్ చేసేయాలని అభిమానులు కోరుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles