ఏకంగా టైటిల్‌ నే మార్చి పడేశారు!

Sunday, December 22, 2024

ఏకంగా టైటిల్‌ నే మార్చి పడేశారు! ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హాలీవుడ్ సహా పలు దేశాలకు సంబంధించిన సినిమాలు ఈ అవార్డుల కోసం పోటీ లో తలపడుతుంటాయి. ఇక ఇండియన్ సినిమా సత్తా ఏమిటో ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఆస్కార్ నిర్వాహకులు చూశారు. ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌తో ఆస్కార్ వేదిక దద్దరిల్లిపోయింది. అంతేగాక, ఈ పాటకు ఆస్కార్ బెస్ట్ సాంగ్ అవార్డ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది భారత్ తరఫున ఆస్కార్ బరిలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘లాపతా లేడీస్’ అధికారిక ఎంట్రీ నమోదు చేసుకుంది. 2025 మార్చి 3న ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది. అయితే, అంతర్జాతీయంగా ఈ సినిమాకు మరింత గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ‘లాస్ట్ లేడీస్’గా టైటిల్ మార్చేశారు ఈ మేరకు చిత్ర డైరెక్టర్ కిరణ్ రావు, నిర్మాత అమీర్ ఖాన్ అధికారికంగా ఈ చిత్ర టైటిల్‌ను మార్చినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈ సినిమాకు గుర్తింపు రావాలని.. తద్వారా ఆస్కార్ అవార్డుల బరిలో ఈ సినిమాను సులువుగా గుర్తించాలనే ఉద్దే్శ్యంతోనే ఈ టైటిల్ మార్చారు. మరి ఈ మూవీ ఆస్కార్ అవార్డుల బరిలో ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles