విశ్వంభర నుంచి అదిరిపోయే అషిక పోస్టర్ విడుదల!

Wednesday, January 22, 2025

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా  ”విశ్వంభ‌ర”. ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వ‌శిష్ట పూర్తి సోషియో ఫాంట‌సీ మూవీగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి స‌రికొత్త లుక్ లో క‌నిపించబోతున్నాడు. ఇప్ప‌టికే విడుదలైన ఈ సినిమా పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాలో అందాల భామలు త్రిష‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  యంగ్ బ్యూటీ అషికా రంగ‌నాథ్  పుట్టిన‌రోజు సందర్బంగా ఆమెకు విశ్వంభ‌ర టీమ్ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ఈ సినిమాలో ఆమె కూడా న‌టిస్తుంద‌నే విష‌యాన్ని వారు క‌న్ఫ‌ర్మ్ చేసినట్లు అయ్యింది.

ఇక ఈ సినిమాకు ఎంఎం.కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, యువీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా విడుదల చేసేందుకు మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles