అర్జున్‌ సర్కార్‌ కోసం జక్కన్న!

Monday, December 8, 2025

నేచురల్ స్టార్ నాని యాక్ట్‌ చేస్తున్న తాజా సినిమా ‘హిట్-3’ గురించి ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో తెలిసిన విషయమే. ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పాత్రలో రఫ్ఫాడించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో నిర్వహిస్తున్నాడు నాని.

కాగా, ఇప్పుడు ఈ సినిమా అంచనాలను మరింత పెంచేందుకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా రాబోతున్నాడు. ‘హిట్-3’ చిత్ర గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి హాజరుకానున్నారు. ఏప్రిల్ 27న జేఆర్‌సి కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి ఏం మాట్లాడుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles