అసలు టెన్షన్‌ వద్దు!

Sunday, April 6, 2025

స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్‌పై సినీ వర్గాల్లో కొంతమేర సందేహం నెలకొనడంతో ఈ మూవీ వేసవిలో రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహాం మొదలైంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ పై చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నాయని.. వేసవి కానుకగా ఏప్రిల్ 18న ఈ సినిమా కచ్చితంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. దీంతో ఘాటీ రిలీజ్‌పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles