టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్‌లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఆమె నటించిన సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందే పరిస్థితి వచ్చింది.
అనుపమ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం “జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ”. ఈ సినిమాలో ప్రముఖ నటుడు, అలాగే “ఐ” చిత్రంలో విలన్‌గా నటించిన సురేష్ గోపి కూడా ఉన్నారు. ఈ సినిమా మలయాళంలోనే కాకుండా తెలుగు భాషలో కూడా రిలీజ్ అవుతుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అంతే కాకుండా నిన్నటి వరకు బయటకు వచ్చిన పోస్టర్స్‌లో కూడా తెలుగు రిలీజ్ గురించి ప్రస్తావించారు.
కానీ విడుదల రోజుకు రాగానే పరిస్థితి పూర్తిగా తారుమారైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో కనిపించలేదు. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం మలయాళంలోనే స్క్రీనింగ్ జరిగింది. దీంతో మేకర్స్ తెలుగు రిలీజ్‌ను పట్టించుకోలేదా, లేక ఇతర కారణాల వల్ల ఇలా జరిగిందా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ పరిస్థితి నిరాశ కలిగించిందనే చెప్పాలి.
ఈ సంఘటనతో అనుపమ అభిమానులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు అనుపమకు మంచి క్రేజ్ ఉంది. అయినప్పటికీ ప్రకటించినట్టుగా తెలుగు వెర్షన్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
