మెగాస్టార్‌ సరసన మరో యంగ్‌ బ్యూటీ

Wednesday, July 3, 2024

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమాని యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ , బింబిసార ఫేమ్‌ వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులని ఎంతగానో ఆలరించింది.

విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ త్రిష కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాను మేకర్స్ 2025 జనవరి 10న, సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుందని టాక్‌. ఈ సినిమా కోసం దర్శకుడు వశిష్ఠ సరికొత్త లోకం సృష్టించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ నటించబోతుంది. క్యూట్ బ్యూటీ అషికా రంగనాథ్ కు వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles