అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా లెనిన్ పట్ల ఫ్యాన్స్‌లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి అఖిల్ కొత్తగా మాస్ అవతారంలో కనిపించబోతున్నాడో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా రూరల్ మాస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఈసారి అఖిల్ పూర్తి బలమైన మాస్ యాంగిల్‌తో, అగ్రెసివ్ లుక్‌లో స్క్రీన్ మీద కనిపించనున్నట్లు సమాచారం. గత సినిమాలతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ అతని కెరీర్‌కు మంచి మైలురాయిగా నిలుస్తుందనే విశ్వాసం అభిమానుల్లో ఉంది.
ఇక తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైంది. అయితే షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను ఎందుకు తప్పుకుందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది కానీ, ఆమె వదిలేసిన ప్లేస్‌లోకి ఇప్పుడు మరో యువ నటి భాగ్యశ్రీ బొర్సేకి ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మార్పు సినిమాకు తాత్కాలికంగా షాక్ ఇచ్చినప్పటికీ, కొత్త హీరోయిన్ ఎంపికతో మళ్లీ స్పీడ్ అందుకుంటుందని భావిస్తున్నారు.
లెనిన్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం, అఖిల్ కెరీర్‌లోని కీలక ఘట్టంగా మారుతుందనే నమ్మకంతో టీమ్ పనిచేస్తోంది.
