కన్నప్ప లో మరో స్టార్‌ హీరోయిన్‌!

Monday, December 8, 2025

మోహన్‌ బాబు కుమారుడు మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ కన్నప్ప. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా అభిమానులు తరువాత వచ్చే అప్డేట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా గురించి అనౌన్స్‌ చేసినప్పటి నుంచి కూడా సినిమా నుంచి వచ్చే ప్రతి అప్టేట్ ఎంతో ఆసక్తిగా ఉంటుంది.

తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయగా, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్‌ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. తాజాగా కన్నప్ప సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమంటే కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సినిమా యూనిట్ ఆమెను స్వాగతిస్తూ విడుదల చేసిన అప్డేట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

ఇప్పటికే విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఇలా మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప సినిమాలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు. అయితే సినిమాలో ఆమె పాత్ర ఏమిటి అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles