మెకానిక్ రాకీ’ నుండి మరో సింగిల్

Tuesday, January 21, 2025

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీనికి తగ్గట్టుగా ఈ చిత్ర పోస్టర్స్, టీజర్‌లు ఉండటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ అయితే మొదలైయ్యాయి.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో తాజా అప్డేట్‌ ఇచ్చేందుకు చిత్ర బృందం రెడీగా ఉంది. ఈ సినిమాలోని ‘‘ఐ హేట్ యు మై డాడీ’’ అనే సాంగ్‌ను నవంబర్ 6న విడుదల చేస్తున్నట్లు.. ఈ సాంగ్ ప్రోమోను నవంబర్ 5న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.  దీంతో ఈ సినిమా పై  ఆడియో పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా చేస్తున్నారని చిత్ర బృందం ప్రకటించింది. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నవంబర్ 22న గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles