తేజ్‌ కోసం మరో సీనియర్‌ నటుడు

Monday, December 23, 2024

సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను రోహిత్ కెపి డైరెక్ట్ చేస్తుండగా సరికొత్త కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో మనకు మేకింగ్ వీడియో గ్లింప్స్‌లో చిత్ర నిర్మాతలు చూపించారు కూడా. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాటు భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ జగపతి బాబు, సాయి కుమార్  నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ లో యాక్ట్‌ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌తో అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ సరికొత్త మేకోవర్‌తో పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నాడు

ఇక ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles