మరో రూమర్‌!

Thursday, December 26, 2024

టాలీవుడ్‌ దర్శకధీరుడు  రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జ‌న‌వ‌రి మూడో వారం త‌ర్వాత రెగ్యల‌ర్ సెట్స్‌ కి  వెళ్తుందని కొద్దిరోజుల క్రితం  వార్తలు వినిపించాయి. ఆ దిశగా రాజ‌మౌళి అండ్ కో ప‌నులు మొదలు పెట్టారు . అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పై మరో వార్త వినపడుతుంది.

అన్నట్లుగానే వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం వ‌ర్క్ షాపులు నిర్వ‌హిస్తున్నారట. ఇప్పటికే రాజ‌మౌళి ఈ సినిమా స్క్రిప్ట్ పై ప‌క‌డ్బందీగా వర్క్ మొదలు పెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమా పై ఏదొక రూమర్ బయటకు వస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని రూమార్లు వచ్చాయి. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు వీరాభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా కథను తయారు చేశానంటూ వివరించారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా రాబోతుందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles