పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ యాక్షన్‌తో నిండిన ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ప్రేక్షకులకు మేకర్స్ కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఓమి అనే కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కనిపించబోతున్నారు. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన వారు మరింత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఓమి పాత్ర స్వభావం ఏమిటో తెలిపేలా ఒక ప్రత్యేక థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.
‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పేరుతో వచ్చిన ఈ పాటలో ఇమ్రాన్ పోషిస్తున్న క్యారెక్టర్ ఎంత క్రూరంగా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చూపించారు. విధ్వంసానికి ప్రతీకగా ఆయనను ప్రెజెంట్ చేయడం పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. థమన్ అందించిన మ్యూజిక్ కూడా ఎనర్జీని పంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
