మరోసారి తప్పిన ప్రమాదం! తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పాల్గొన్నారు. ఐతే, ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం విచారకరం. పైగా అజిత్ కారు ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. తాను క్షేమంగా ఉన్నారని అజిత్ తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో హీరో అజిత్ తప్పు ఏమీ లేదని.. ఇతర కార్ల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి అధికారులు తెలియజేశారు. అన్నట్టు ప్రమాదం జరిగిన కొంత సమయానికి ఆయన బయటకు వచ్చి.. అభిమానులతో ఫొటోలు దిగడం అక్కడి వారిని ఆకట్టుకుంది.