‘జటాధర’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్..!

Saturday, December 21, 2024

నవదళపతి సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫీల్ గుడ్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’ను విడుదలకు రెడీ చేసిన ఈ హీరో, తన నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్‌గా ‘జటాధర’ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన ‘జటాధర’ సినిమా నుంచి మేకర్స్ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా చిత్ర బృందం తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను మూవీ మేకర్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

 ఈ పోస్టర్ సినిమాలోని పవర్స్‌కి సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఇక ‘జటాధర’ సినిమాని వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా.. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటించబోతుందని సమాచారం. అటు లేడీ విలన్ పాత్రలో బాలీవుడ్ భామ రవీనా టండన్ నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles