చరణ్‌ ఖాతాలో మరో ఐకానిక్‌ రోల్‌!

Monday, March 31, 2025

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు రామ్ చరణ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ల లోనే భారీ ఫేమ్ ని అందుకున్నాడు. ఇలా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తాను నటుడుగా కూడా కేవలం ఈ కొన్ని సినిమాల్లోనే చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కూడా కాదు. రెండో సినిమా మగధీర లోనే ఎంతో పరిణితి కనబరిచిన చరణ్ అక్కడ నుంచి రంగస్థలంలో చిట్టి బాబుగా ఒక లైఫ్ టైం రోల్ ని చేసి ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇచ్చాడు.

దానికి నేషనల్ అవార్డు కూడా వస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ అది నెరవేరలేదు. ఇక రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలో అప్పన్న పాత్రతో చరణ్ మరోసారి అందరికీ షాకిచ్చాడు. చిట్టి బాబుని మించిన నటుడు తనలో ఉన్నాడని అద్భుతంగా చేసి చూపించాడు. ఇక ఇపుడు ఈ రెండు పాత్రలు తర్వాత మరో ఐకానిక్ పాత్ర తన లేటెస్ట్ చిత్రం “పెద్ది”తో పడబోతున్నట్టు అనిపిస్తుంది.

వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సాలిడ్ హైప్ ని తాను అందుకోగా తన మాస్ అండ్ రగ్గుడ్ లుక్స్ తో తన పెర్ఫామెన్స్ కూడా సినిమాలో అదిరిపోతుంది అని ఇపుడు తెలుస్తుంది. దీనితో పెద్ది కూడా చరణ్ కెరీర్లో ఒక ఐకానిక్ పాత్రగా నిలిచిపోతుంది అని ఇపుడు నుంచే టాక్ మొదలైంది. మరి ఆ రేంజ్ లోనే ఉంటుందా లేదా దర్శకుడు బుచ్చిబాబు ఎలా ప్లాన్ చేసాడో అనేది వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles