గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేరే లెవెల్‌లో నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్.
తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్స్‌ను టాలీవుడ్ క్రేజీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ గురించి తాజాగా అన్‌స్టాపబుల్ షూటింగ్ సెట్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. బాలయ్యతో పాటు రామ్ చరణ్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిసిన విషయమే. అయితే, తాజాగా ఈ షూటింగ్‌లో మరో హీరో, చరణ్ బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ టాక్ షోలో చరణ్, శర్వానంద్ తమ స్నేహనికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తారా లేక సినిమా పరంగా మాట్లాడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.