విడాకులు తీసుకున్న మరో స్టార్‌ హీరో..!

Tuesday, January 21, 2025

ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్‌ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమా రిజల్ట్ తో పని లేకుండా వరుస సినిమాలు చేసుకుంటు జీవీ వెళ్లిపోతున్నాడు. ఒకే ఏడాదిలో నాలుగు నుంచి ఐదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు విడుదల అయ్యాయి.

 కొన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ టాక్‌ ను సొంతం చేసుకుంటున్నాయి. అయితే జీవి తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం  వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అవుతున్నాయి.

మొన్న హీరో ధనుష్ విడాకులు తీసుకోగా, నిన్న జీవి ప్రకాష్ కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా హీరో జీవీ ప్రకాష్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా బయటకు వచ్చింది. ఈ విషయం గురించి తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతాలో  పోస్ట్ షేర్ చేస్తూ .. ఎంతో ఆలోచించి… చివరికి విడిపోవాలని నేను, సైంధవి నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరుగుతున్నాయి. మా ఈ నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని, అలాగే మా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని భావించిన తర్వాతే విడాకులకు సిద్ధమయ్యాం.. అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles