దేవర నుంచి మరో అదిరిపోయే ట్రీట్‌!

Sunday, December 22, 2024

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా మాస్‌ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నమోస్ట్‌ అవైటెడ్ భారీ సినిమా “దేవర”. మరి ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా కొరటాల అలాగే ఎన్టీఆర్ ల కలయికలో ఇది రెండో సినిమాగా వస్తుండడంతో సినిమా పై మంచి హైప్ నెలకొంది.

అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ ఫియర్ సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా దీని తర్వాత నెక్స్ట్ సాంగ్ ఎప్పుడా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దేవర సాంగ్ పై అప్డేట్ ఈ వారంలోనే ఉంటుందని సమాచారం. మరి ఫైనల్ గా దీనిపై ఆడియో లేబుల్ సంస్థ టి సిరీస్ వారు ఇప్పుడు మరో హింట్ ఇచ్చారు.

ఈసారి దేవర నుంచి ఒక లవ్ సాంగ్ ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ మరో క్లారిటీ ఇచ్చారు. సో దేవర నుంచి రెండో సాంగ్ కి కూడా మొత్తం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అలాగే ఈ సాంగ్ పై మరింత క్లారిటీ ఈ కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా గ్రాండ్‌ గా విడుదల చేసేందుకు రంగం సిద్దమవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles