మరో క్రేజీ రూమర్‌!

Sunday, December 22, 2024

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌ లో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న మూవీ  ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ పై ఓ వార్త తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ అభిమానులకు ‘పుష్ప 2’ సినిమా క్లైమాక్స్ ఓ యాక్షన్ ఫీస్ట్ అని.. ముఖ్యంగా పుష్పగా అల్లు అర్జున్ ఊచకోతకు విలన్స్ వెన్నులో వణుకు పుడుతుందని, మొత్తానికి పుష్ప 2 క్లైమాక్స్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని సమాచారం.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు తెలుగు సినిమాల మార్కెట్ రోజురోజుకు బాలీవుడ్ లో కూడా విపరీతంగా పెరుగుతుంది. కాగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్ గా నటిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles