విడాకులు తీసుకోబోతున్న మరో బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌!

Wednesday, January 22, 2025

గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుని విడిపోవడం స్టార్‌ కపుల్‌ కు కామన్‌ అయిపోయింది.  ఇటీవల కాలంలో చాలా మంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుని మరీ కొద్ది రోజులకు విడిపోతున్నారు. ఇప్పుడు మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట తెగ షికారు చేస్తుంది.

 బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆయన తన చేతి మీద ఉన్న భార్య టాటూను తొలగించడంతో అంతా విడాకులు కన్ఫర్మ్ అయినట్టే అని చర్చించుకుంటున్నారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ 2012లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఫ్యామిలీతో నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఈ జంట. అలాగే పలు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తారు.

ఇదిలా ఉంటే..  కరీనా పేరును సైఫ్ చేతిపై టాటూ వేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఆ టాటూ ప్లేస్‌లో మరొకటి కనిపించింది. ముంబై ఎయిర్ పోర్ట్‌లో సైఫ్ చేతిపై కరీనా పేరు కాకుండా త్రిశూలం ఉంది. ప్రస్తుతం సైఫ్ వీడియో వైరల్ కావడంతో అది చూసిన అభిమానులు..  వీరు కూడా విడాకులు తీసుకోబోతున్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అందులో నిజం లేదు. సినిమా కోసమే టెంపరరీగా త్రిశూలం వేసుకున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇక సైఫ్ సినిమాల విషయానికొస్తే.. దేవరలో విలన్‌గా నటిస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles