షారుఖ్ కోసం అనిరుద్..!

Tuesday, December 3, 2024

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా  మూడు సినిమాలు కూడా భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పఠాన్, జవాన్ అలాగే డంకీ మూడు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన షారుఖ్ ఖాన్ ఇపుడు చేతినిండా సినిమాలతో షూటింగ్ లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

అయితే ఈ నేపథ్యంలో తన వారసుడు ఆర్యన్ ఖాన్ గురించి  ఓ సాలిడ్ ప్రకటనని అందించాడు.
తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ అలాగే దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తో కలిపి ఓ భారీ సిరీస్ కోసం చేతులు కలుపుతున్నట్టుగా సమాచారం.

అయితే ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకునిగా నెట్ ఫ్లిక్స్ తో ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలిసింది.
ఆర్యన్ దగ్గర సాలిడ్ స్టోరీ ఉందని గట్సీ సన్నివేశాలు మంచి ఫన్, ఎమోషన్స్ ఈ సిరీస్ ల ఉంటాయి అని కింగ్ ఖాన్ అయితే చెబుతున్నాడు. మరి దీంతో పాటుగా మరో ఎగ్జైటింగ్ డీటెయిల్ కూడా బయటకి వచ్చింది. ఈ అనౌన్సమెంట్ పై కింగ్ ఖాన్ షారుఖ్ తో జవాన్ లాంటి సాలిడ్ ఆల్బమ్ ని అందించిన సంగీత దర్శకుడు అనిరుద్ కూడా సిద్ధంగా ఉండండి అంటూ సమాధానమిచ్చాడు.

దీంతో మరోసారి షారుఖ్ కోసం తాను వర్క్ చేయబోతున్నాడని చెప్పొచ్చు. అయితే ఈ సిరీస్ వచ్చే ఏడాది 2025 నుంచి మొదలు పెట్టనున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles