ఆంధ్రాకింగ్‌ తాలుకా యూస్ డీల్‌ కంప్లీట్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా “ఆంధ్రా కింగ్ తాలూకా”పై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ సినిమాకు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలు మహేష్ బాబు పి తీసుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాకు అదిరే రెస్పాన్స్ తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు మొదటి నుంచి బజ్ బాగానే ఉందని చెప్పాలి. ఇప్పటివరకు వచ్చే బిజినెస్ ఆఫర్స్ కూడా సినిమాకు మంచి క్రేజ్ ఉన్నట్టు స్పష్టంగా చూపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా యూఎస్ మార్కెట్‌లో డీల్ క్లోజ్ అయ్యింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా ఈ సినిమాను అక్కడ విడుదల చేయనుందని అధికారికంగా వెల్లడైంది. అయితే ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు.

వివేక్ – మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, రియల్ స్టార్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. సినిమాకు వస్తున్న బజ్ చూస్తే, థియేటర్స్‌లో మంచి రన్ అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles