యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు పి. మహేష్ బాబు ప్రత్యేకమైన స్టైల్లో రూపకల్పన చేస్తున్నారు. సినిమా మొదటి నుంచే రామ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో మంచి స్పందనను రాబట్టాయి. రామ్ క్యారెక్టర్, లుక్, ప్రెజెంటేషన్ — అన్నీ ఫ్యాన్స్‌కి కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఫ్యాన్స్ బయోపిక్ అని పలు చోట్ల ప్రచారం జరుగుతుండటంతో ఆసక్తి మరింత పెరిగింది.
ఇక తాజాగా మేకర్స్ సినిమా టీజర్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. నిన్న టీజర్ డేట్‌ను ప్రకటించిన తర్వాత, ఇప్పుడు సమయాన్నీ ఫిక్స్ చేశారు. అక్టోబర్ 12న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ టీజర్ విడుదల కానుంది. రామ్ పోతినేని ఎనర్జీకి తగ్గట్టుగా ఈ టీజర్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.
