ఆ విషయంలో మోడీనే వెనక్కి నెట్టిన అందాల భామ!

Tuesday, January 21, 2025

ప్రధానమంత్రి మోడీని ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెనక్కి నెట్టేసింది. అదేంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి ఒక రకంగా చెప్పాలంటే ఇండియా వరకు చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అనే విషయం తెలిసిందే. ఆయనకు ఇంస్టాగ్రామ్ , అంతేకాకుండా ట్విట్టర్ విషయంలో కూడా చాలామంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. రాజకీయ నాయకుల్లో ఆయనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అని తెలుస్తుంది. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ సూపర్ స్టార్లకు సైతం లేని పాపులారిటీ మోడీకి ఉంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో నరేంద్ర మోడీని దాటేసింది. ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఆమెకు 91.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ చేరారు. ఇక మోడీ విషయానికి వస్తే ఆయనకు కేవలం 91.3 ఫాలోవర్స్ ఉన్నారు. ఒక రకంగా ఆమె మోడీని దాటి ముందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇండియా మొత్తం మీద అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచారు.

ఆయనకు ఏకంగా 271 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత స్థానంలో ప్రియాంక చోప్రా 91.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా…ఇప్పుడు శ్రద్ధా కపూర్ మూడవ స్థానంలో నిలిచి 91.6 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకుంది. ఇక ప్రధానమంత్రి మోడీ నాలుగో స్థానంలో ఉండగా అలియా భట్ 85.2 మిలియన్ ఫాలోవర్స్ తో ఐదవ స్థానంలో నిలిచింది.

స్త్రీ 2 సినిమాలో ఇటీవలే శ్రద్ధా కపూర్ కనిపించింది, ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రాజకుమార్ రావు హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత శ్రద్ధా కపూర్ కి ఫాలోవర్స్ పెరుగుతున్నారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles