పవన్‌ తో డ్యాన్స్‌ గురించి అనసూయ కామెంట్స్‌!

Wednesday, January 22, 2025

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా బిజీబిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన రాబోయే సినిమాలు ఓజీ, హరి హర వీర మల్లు,  ఉస్తాద్‌ భగత్ సింగ్ పెద్ద స్క్రీన్‌లపైకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. నెలకు ఒకటి రెండు రోజులు తన సినిమాలకు పని చేస్తానని ఇటీవల ఓ బహిరంగ సభలో పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.

ప్రముఖ యాంకర్ అనసూయ పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాలో ఒక ప్రత్యేక పాటలో నటించినట్లు అనసూయ చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అనసూయ ఓ టెలివిజన్ షోలో వెల్లడించింది. టెలివిజన్‌లో తొలిసారిగా నేను ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోబోతున్నాను. పవన్ సర్‌తో కలిసి నేను ఒక అందమైన డ్యాన్స్‌ ను చేశానని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ పాట సూపర్‌ గా ఉంటుంది.. చాలా బాగుంటుంది అని ఆమె వివరించింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు కోసం అనసూయ స్పెషల్ సాంగ్ అని తెలిపారు.

క్రిష్ మొదట ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించాడు, కాని తరువాత, ఆయన జ్యోతి కృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా యాక్ట్‌ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles