వారిద్దరి ఫోటోలు చూపిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన ఆనంద్‌ దేవరకొండ!

Sunday, December 22, 2024

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి రిలేషన్‌ గురించి ఇప్పటి వరకు చాలా రకాల కామెంట్లు వచ్చాయి. కానీ ఎప్పుడూ కూడా వీరిద్దరూ తమ రిలేషన్‌ గురించి ఎక్కడ ఓపెన్‌ కాలేదు. విజయ్‌, రష్మిక కలిసి చాలా సినిమాల్లో నటించారు. మొదటి సినిమా నుంచే వీరిద్దరి స్నేహం కొనసాగుతుంది.

కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ పోస్ట్‌ చేసిన ఫోటోల్లో ఒకే బ్యాగ్రౌండ్‌ ఉండడంతో అభిమానులు వీరు ఒకేచోట కలిసి ఉన్నారని అభిమానులు, ప్రేక్షకులు అనుకున్నారు. తాజాగా ఈ విషయం గురించి విజయ్‌ తమ్ముడు ఆనంద దేవరకొండ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆనంద దేవరకొండ గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ  నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జబర్దస్త్ ఇమ్మానుయేల్ తో కలిసి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రెండో ఇంటర్వ్యూ తాజాగా విడుదల  అయింది. ఇందులో  ఆనంద్ దేవరకొండని ఇదే ప్రశ్న అడిగాడు ఇమ్మానియేల్. విజయ్ దేవరకొండ రష్మిక ఒకే రిసార్ట్ లో ఉన్నట్లు నా దగ్గర ఫోటోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయి అని ఆనంద్ తెలిపాడు.

అంతేకాక బహుశా అది కో ఇన్సిడెన్స్ అయి ఉండవచ్చు అంటూ మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. అంతేకాక ఒకే రిసార్ట్ కి ఇద్దరూ ఎలా వెళ్లారు? అని అడిగితే దూరం కదా విమానంలో వెళ్లారు అంటూ చాలా  వెటకారంగా సమాధానం ఇచ్చాడు. అయితే వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడిగితే మాత్రం ఆ సీక్రెట్ ఇక్కడ చెప్పొచ్చా అని అడిగి చివరికి తర్వాతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తోందంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.

దీంతో ఆనంద్‌ మాటలతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారం తెరమీదకు వచ్చినట్లు అయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles