రాజాసాబ్‌ నుంచి అప్డేట్‌ వచ్చేసిందోచ్‌!

Wednesday, September 18, 2024

బాహుబలి సినిమా తరువాత జాతీయ నటుడిగా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తూ వస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్‌. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ  తెలిసిన విషయమే. తాజాగా ఆ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చేతినిండా  సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు ప్రభాస్.

మారుతి డైరెక్షన్‌ లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచుతున్నాయి.

 ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన గ్లింప్స్ చూసి ప్రభాస్ ను మళ్లీ వింటేజ్ లో చూసినట్టు ఉందని.. మిర్చి తరువాత మళ్లీ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ గ్లోబల్ స్థాయికి వెళ్ళాక హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ తో సినిమా చేస్తూ ట్రేడ్ వర్గాలని షాక్‌ కి గురిచేశాడు.

దర్శకుడు మారుతి ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి. రాజాసాబ్‌ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలైన మీడియా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles