ప్రతి పదాన్నీ నొక్కి వక్కాణిస్తూ.. కనుబొమ్మలు ముడివేస్తూ మాటమాటకూ హావభావ ప్రకటనలను జోడిస్తూ ప్రెస్ మీట్ ను కూడా ఏకపాత్రాభినయం లాగా రక్తి కట్టించగలగడంలో వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ మంత్రి అంబటి రాంబాబును మించిన వారు లేరు. అందుకే ఆయన ఇటీవల ఒక కేసులో కోర్టులో హాజరైనప్పుడు తెలుగులో తన వాదనలు వినిపించడానికి అనుమతించాలని న్యాయమూర్తిని కోరినప్పుడు.. ‘తెలుగులో మాట్లాడేందుకు అనుమతిస్తే మిమ్మల్ని నియంత్రించలేం’ అని న్యాయమూర్తి కూడా ఛలోక్తి విసిరారు. అలాంటి అంబటి రాంబాబు.. ఇప్పుడు అమరావతి నగర పునర్నిర్మాణ పనులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన వెంటనే మీడియా ముందుకు వచ్చి.. తన అమూల్యమైన అభిప్రాయాలు సెలవిస్తున్నారు. కొంచం జాగ్రతగా గమనిస్తే ఆయన చెబుతున్న ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డిని దెప్పిపొడుస్తున్నట్టుగా, ఆయనను ఎద్దేవా చేస్తున్నట్టుగా, విమర్శిస్తున్నట్టుగా ఉన్నదే తప్ప.. చంద్రబాబునాయుడు ను తిడుతున్నట్టుగా కనిపించడం లేదు. ఇంతకూ ఆయన మాటలను గమనిద్దాం.
అంబటి : అమరావతి విషయంలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు.
వివరణ : ఇక్కడ ఉండాల్సిన పేరు జగన్మోహన్ రెడ్డి కదా. 2019 ఎన్నికలకు ముందు అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు జగన్. రాజధానిగా అమరావతిని ఆమోదిస్తున్నందువల్లే.. అక్కడ తమ నాయకుడు సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడని.. చంద్రబాబునాయుడుకు ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదని అంబటి సహా వైసీపీ నాయకులు అందరేూ అప్పట్లో ఊదరగొట్టారు. అమరావతి రాజధానికి తమ పార్టీ కూడా జై కొడుతున్నట్టే.. దానికి జగన్ సొంత ఇల్లే నిదర్శనం అని ప్రజల్ని మోసం చేశారు. అమరావతి విషయంలో అబద్ధాలు చెప్పింది జగన్ కదా.. అంబటి మాటల్లో చంద్రబాబు, లోకేష్ అంటున్నారేమిటి? అనేది ప్రజల సందేహం.
అంబటి : అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందుకే ప్రజలు చంద్రబాబును చిత్తుగా ఓడించారు.
వివరణ : చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమారవతిలో పూర్తిస్థాయిలో సచివాలయ భవనాల్ని నిర్మించారు. అవి శాశ్వత భవనాలే గానీ.. అందులో సచివాలయ నిర్వహణ మాత్రం తాత్కాలికం అని ప్రకటించారు. అధికార్లు, మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్లు 70-80 శాతం పూర్తయ్యాయి. ఐకానిక్ భవనాల నిర్మాణం ప్రారంభించి.. పునాదులు పూర్తిచేస్తున్న సమయంలో అధికారం మారింది. కాబట్టి ప్రజలు చంద్రబాబును అమరావతి కారణం మీద ఓడించారని అనడానికి వీల్లేదు. కానీ జగన్ పరిపాలించిన అయిదేళ్ల కాలంలో.. అమరావతి నిర్మాణాలకు ఒక్క ఇటుక కూడా జోడించలేదు. ఆ ప్రాంతాన్ని శ్మశానంలాగా మార్చేశారు. అడవిలాగా తయారుచేశారు. ఇందుకు కదా.. జనం జగన్ అహంకారాన్ని చీదరించుకుని, ఆయనను అత్యంత నీచంగా 11 సీట్లకు పరిమితమైన పార్టీ నేతగా ప్రతి పక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఈ మాట జగన్ ను సూటింగా నిందించలేక.. అంబటి రాంబాబు.. నర్మగర్భంగా చంద్రబాబు పేరుతో జగన్ నే హేళేన చేస్తున్నారా? అనిపిప్తోంది.
అంబటి : పదేళ్లు హైదరాబాదును రాజధానిగా వాడుకోమని అవకాశం ఇచ్చినా అక్కడ తంతే చంద్రబాబు వచ్చి ఇక్కడ పడ్డారు.
వివరణ : చంద్రబాబు రాజధాని కట్టాలనే సంకల్పంతో వచ్చారు కాబట్టే.. అప్పట్లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ.. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు తంతే.. ఆయన వెళ్లి ప్రతివారం బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో పడుతున్నారు కదా?
అంబటి : సెల్ఫ్ సస్టయినబుల్ నగరం అంటే.. 52వేల కోట్ల అప్పు ఎందుకు?
వివరణ : అప్పులు చేసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పప్పులు బెల్లాలు పంచినట్టుగా పంచే వారికి సెల్ఫ్ సస్టయినబుల్ అనే పదానికి అర్థం తెలియదు. నిర్మాణాలను పూర్తిచేయడానికి అప్పులు! పూర్తిచేసిన తరువాత.. విలువ పెరిగిన స్థలాలను విక్రయించడం ద్వారా అప్పులు తీరుస్తారు! సెల్ఫ్ సస్టయినబిలిటీ అంటే అది. అప్పులు తెచ్చిన డబ్బులు అయిదొందల కోట్లు తగలేసి.. నివాసం కోసం అతిథిభవనాలు ముసుగులో తనకోసం ఇళ్లు కట్టుకోవడం కాదు.. అని ఆయన జనం అంబటి మాటల గురించి అనుకుంటున్నారు.
ఆయన చెబుతున్న ప్రతిమాట.. జగన్ వైఫల్యాలను పరోక్షంగా ప్రస్తావిస్తున్నట్టే ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
