అమరన్’ తెలుగు ప్రమోషన్స్‌కి ముహుర్తం ఖరారు!

Wednesday, January 22, 2025
తమిళ హీరో శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న బయోపిక్ మూవీ ‘అమరన్’ . ఈ సినిమా దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సినిమాను మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దం అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుండడంతో ఆమెకు తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ ఉందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని అక్టోబర్ 26న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేస్తోంది. దీంతో ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమాను గ్రాండ్ గావిడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles