“అమరన్” విడుదల తేదీ ఖరారు!

Thursday, September 19, 2024

కోలీవుడ్ స్టార్‌ యాక్టర్టు శివ కార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ అమరన్. ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌లో ఆఫీసర్ అయిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఈ సినిమా. ముకుంద్ వరదరాజన్‌ కు మరణానంతరం అశోక చక్రను భారత ప్రభుత్వం అందజేసింది. గత కొన్ని రోజులుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలోకి విడుదల కానుంది. మూవీ విడుదల తేదీని వెల్లడించడానికి మేకర్స్ శివకార్తికేయన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. రంగూన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్,  సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ గురించి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles