పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో కనిపించాడు కానీ అతడి తొలి నిజమైన పాన్ ఇండియా మూవీగా “హరిహర వీరమల్లు” పేరు చెబుతున్నారు. ఈ సినిమాను జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలిసి భారీ ఎత్తున రూపొందించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ట్రైలర్ మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో అలరిస్తాడనే నమ్మకం వస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నింటికంటే ఈ పాత్ర చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికీ ఓజి అనే మూవీ గురించి ఫ్యాన్స్ ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ ట్రైలర్ వచ్చాక మాత్రం మూడ్ మారిపోయింది. ట్రైలర్ చూస్తే “వీరమల్లు” పాన్ ఇండియా స్కేల్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.
సినిమా వాస్తవంగా ఎలా ఉంటుందో తెలియాలంటే జూలై 24 వరకు ఎదురు చూడాల్సిందే. కానీ ఈ ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పటి నుంచో ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడైనా కన్‌ఫర్మ్ డేట్ తో హ్యాపీగా ఉన్నారు. ట్రైలర్ లో చూపించిన విజువల్స్, పవన్ డైలాగ్ డెలివరీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలసి సినిమాపై క్రేజ్ ని రెట్టింపు చేశాయి.
ఇకపోతే, నిర్మాత ఏ ఎం రత్నం కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు స్పెషల్. ఇప్పటి వరకు ఫ్యాన్స్ ఓజి గురించి మాట్లాడారని, కానీ ఇప్పుడు వీరమల్లు గురించి వాళ్లు ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన తెలిపాడు. ఇవి చూస్తుంటే ఇక ఓజి మేనియా కంటే హరిహర వీరమల్లు బజ్ మరింత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మొత్తానికి చూస్తే జూలై 24న విడుదల కాబోయే ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోంది. సినిమా ఎలా ఉందో చూద్దాం కానీ ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ తో మాత్రం భారీ దుమారం నడుస్తోంది.
