అల్లు అర్జున్‌ , అట్లీ సినిమా క్యాన్సిల్‌!

Tuesday, January 21, 2025

స్టైలిష్‌ స్టార్‌, జాతీయ నటుడు అల్లు అర్జున్‌ ప్రస్తుతం క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ కాంబోలో పుష్ప 2 సినిమాలో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ముందు చిత్ర బృందం ప్రకటించినప్పటికీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దీని గురించి చిత్ర బృందం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ యంగ్ డైరెక్టర్ అట్లీ తో ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే.అట్లీ గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ సినిమా తీసి మంచి హిట్‌ అందుకున్నాడు.దీంతో పలువురు స్టార్ హీరోలు అట్లీ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

అయితే తాజాగా అట్లీ ,అల్లుఅర్జున్ కాంబోలో రాబోయే మూవీ ఆగిపోయినట్లు సమాచారం. సన్ పిక్చర్స్ మూవీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.దీంతో అంత భారీ మొత్తం ఇవ్వలేని మేకర్స్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే బన్నీనో, అట్లీనో స్పందించాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles