బన్నీ కోసం హీరోయిన్‌ ని లాక్‌ చేసిన అట్లీ!

awposter
1 Min Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్‌ చేశాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడట ఈ స్టార్ హీరో.

తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రాబోతుందని సమాచారం. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌ను కూడా అట్లీ ఫైనల్‌ చేశాడు.

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడంట అట్లీ. అటు అందంతో  పాటు అభినయంతో కూడా అభిమానులను ఆకట్టుకునేందుకు ఆమెను ఈ సినిమాలో తీసుకున్నాడట. ఇక అట్లీ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడట.

Share This Article