ఫౌజీ కోసం భారీ బడ్జెట్ పెట్టనున్న మైత్రీ సంస్థలు!

Friday, December 5, 2025

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. పీరియాడిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాను మైత్రి సంస్థవారు నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను వారు ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది పుష్ప చిత్రం కంటే కూడా ఎక్కువ అని తెలుస్తోంది. ఈ సినిమాపై వారు పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉండటం వలనే ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles