డైనమిక్‌ యంగ్‌ ప్రొడ్యూసర్‌ తో అల్లరోడి సినిమా ప్రారంభం!

Sunday, December 22, 2024

ప్రస్తుత హీరోస్‌ లో కామెడీ జానర్‌ హీరో అంటే అల్లరి నరేష్‌ నే అని చెప్పుకొవచ్చు. అయితే అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో పలు సీరియస్ సబ్జెక్టులు కూడా చేస్తూ ఉన్నాడు. అలా రీసెంట్ గా డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఈ పోస్టర్ వైరల్ గా మారింది. .ఇప్పుడు మూవీ బృందం అధికారికంగా జులై 27న పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలు పెట్టింది. “ఫ్యామిలీ డ్రామా” మూవీతో ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని  నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles