టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘మంగళవారం’ ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో అందాల భామ పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేత, ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి సక్సెస్ అయ్యింది.
అయితే, ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీని డైరెక్టర్ అజయ్ భూపతి రెడీ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో పాయల్ నటించడం లేదనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని నిజం చేస్తూ పాయల్ ‘మంగళవారం’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పింది.
సోషల్ మీడియా వేదికగా ‘‘అజయ్ భూపతి డైరెక్షన్‌లో నటించడం ఎప్పటికీ మరిచిపోనని.. ఆయన నుంచి త్వరలోనే మరో మాస్టర్ పీస్ కోసం ఎదురుచూస్తున్నాను.. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలి..’’ అంటూ పాయల్ ఆ పోస్టులో రాసుకొచ్చింది.దీంతో మంగళవారం సీక్వెల్ మూవీలో పాయల్ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది.
