అదంతా నిజం కాదు…క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Wednesday, January 22, 2025

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబోలో వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన లోకేషన్స్‌, నటుల సెలక్షన్స్‌ లో చిత్ర బృందం, నిర్మాతలు బిజీగా ఉన్నారు. అంతేగాక ఈ సినిమాలో మ‌హేశ్‌బాబు లుక్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. అయితే ఈ క్ర‌మంలో ఈ సినిమా విష‌యంలో ఇటీవ‌ల జ‌రుగుతున్న ఓ వార్త విష‌యంలో చిత్ర నిర్మాత కేఎల్ నారాయ‌ణ ఓ క్లారిటీ ఇచ్చారు.

అసలు విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ‌ ఆంగ్ల వార్తా ప‌త్రిక రాజ‌మౌళి , మ‌హేశ్ బాబు కాంబోలో వ‌స్తున్న సినిమాకు గ‌తంలో అప‌రిచితుడు, 1 నేనొక్క‌డినే చిత్రాల‌కు ప‌ని చేసిన‌ ప్ర‌ముఖ క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ వీరెన్ స్వామిని తీసుకున్న‌ట్లు ప్ర‌చురించారు. దీంతో ఈ వార్త సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అయింది. ఈ న్యూస్‌ కాస్త సినిమా మేక‌ర్స్ వ‌ద్ద‌కు చేర‌డంతో ఇప్పుడు ఈ విష‌య‌మై దుర్గా ఆర్ట్స్ నిర్మాత నారాయ‌ణ స్పందించారు.

‘ఎస్‌ఎస్‌ఎంబీ 29స సినిమాకు సంబంధించి ఇంత‌వ‌ర‌కు ఎవ‌రినీ తీసుకోలేద‌ని, ప్ర‌స్తుతం ఫ్రీ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నామ‌న్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. అప్పటి వరకు మూవీ గురించి ఎలాంటి అసత్య ప్రచారాలు చేయోద్దని ఆయన కోరారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles