పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండటంతో ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బయటకు వచ్చిన పవన్ స్టైలిష్ లుక్, టీజర్లు ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని రేపాయి.
ఈ సినిమాను సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక నేటి వరకు చూసుకుంటే రిలీజ్‌కి కచ్చితంగా నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. షూటింగ్ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని సినిమా యూనిట్ తెలిపింది.
మరిన్ని సర్ప్రైజ్‌లు కూడా ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా రెండో పాటను ఆగస్టు 27న ఉదయం 10.18 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
