ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలసి ఒకే స్క్రీన్‌పై అలరించబోతున్న భారీ యాక్షన్ సినిమా వార్ 2 ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ మాస్ కాంబినేషన్‌కి మంచి అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు విడుదల కాబోతున్న థియేట్రికల్ ట్రైలర్‌కి మరింత ఆసక్తి పెరిగింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిలింస్ సూపర్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో ఒక స్థాయిలో హైప్ క్రియేట్ అయిందంటే, ఈసారి ట్రైలర్ మాత్రం అందరినీ మరింత ఊహించని స్థాయికి తీసుకెళ్లేలా ఉండబోతోందనే బజ్ ఉంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, రెండు పవర్‌ఫుల్ హీరోల ఫేస్ ఆఫ్ మోమెంట్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి.
ఈరోజు థియేటర్లలోనే కాకుండా ఆన్లైన్ లో కూడా ట్రైలర్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలని తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హృతిక్ రోషన్ ఇప్పటికే తన పాత్రకు బాగా ఫిట్ అయిపోయాడు అనే ఫీల్ తో ప్రేక్షకులు ఉన్నారు.
వార్ 2 ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సినిమా మీద అంచనాలు ఇంకా పెరగడం ఖాయం. ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఆ భారీ ట్రైలర్ పైనే ఉంది.
