అక్కినేని వారబ్బాయి-కొణిదెల వారమ్మాయి!

Sunday, December 22, 2024

రాజమౌళి కుమారుడు కార్తికేయ డైరెక్షన్‌ లో నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌ గా అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కిందట. అయితే ఈ షార్ట్‌  ఫిలిం చూసిన తర్వాత దానిని విడుదల చేయకుండా ఉండడమే మంచిది అని దర్శకధీరుడు రాజమౌళి అభిప్రాయ పడడంతో అది ప్రేక్షకుల ముందుకు రాలేదంట.

అందేంటి అప్పుడు తెలియనిది ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అనుకుంటున్నారా..ఈ విషయం గురించి స్వయంగా నిహారికనే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూస్ లో ఒక దానిలో ఈ విషయం గురించి బయటకు చెప్పింది. నిజానికి విశ్వక్సేన్ దినేష్ నాయుడుగా ఉన్నప్పుడు నిహారికతో కలిసి ఒక షార్ట్ ఫిలిం రూపొందించాడు. కానీ ఆ ఫిలిం బయటకు విడుదల కాలేదు. ఆ విషయాన్ని ప్రస్తావించగా అది ఆ సంగతి పక్కన పెడదాం నేను అఖిల్ తో కూడా ఒక షార్ట్ ఫిలిం చేశాను దాని దర్శకుడు రాజమౌళి గారి కుమారుడు కార్తికేయ అని నిహారిక తెలిపింది.

అంతేకాకుండా తనకు యాక్టింగ్ అంటే అప్పుడు చాలా పిచ్చి ఉండేదని అప్పుడు తన పళ్లకు బ్రేసెస్ ఉండేవి కానీ ఈ షార్ట్ ఫిలిం కోసమని ఆ బ్రేసెస్ కూడా తొలగించాను అంటూ ఆమె అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది. అయితే ఆ షార్ట్ ఫిలిం బాగా రాకపోవడంతో రాజమౌళి సూచనలు మేరకు బయటకు విడుదల చేయలేదని ఆమె వివరించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles