అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తాజాగా న్యూ ఢిల్లీలోని పార్లమెంట్‌లో భారత ప్రధాని మోడీని కలిశారు. ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు ఇండియన్ సినిమాకు చేసిన సేవలను మోడీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మోడీకి తమ కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వర్ రావు పై బయోగ్రఫీ బుక్‌ని మోడీ ఆవిష్కరించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని వ్యక్తిత్వ కా విరాట్’ అనే పుస్తకాన్ని మోడీ ఈ సందర్భంగా లాంచ్ చేశారు. ఇక నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత, నాగసుశీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.