పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఓజీ సినిమా విడుదలైనప్పటి నుంచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లు సాధించి పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ విజయంతో ఇప్పుడు ఓజీ సీక్వెల్‌పై చర్చలు వేడెక్కుతున్నాయి.
ఇటీవలి రోజులుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్ ఓజీకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక కార్యక్రమంలో సుజీత్ తనకు ఓ పాయింట్ చెప్పాడని చెప్పడంతో, అభిమానుల్లో ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. దీంతో, ఓజీ కథకి రెండో భాగం ఉండబోతుందనే ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి.
అయితే, ఈ సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్‌నే హీరోగా చూపిస్తారా? లేక ఆయన కుమారుడు అకీరా నందన్‌ను పరిచయం చేస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ చెప్పిన మాటల ప్రకారం కథలో ఆయనకు సంబంధించిన ఆలోచన ఉందనే సంకేతాలు ఉన్నాయి. అదే సమయంలో, సుజీత్ ప్రస్తుతం నాని హీరోగా ఓ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఓజీ సీక్వెల్‌పై దృష్టి సారించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
