నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “అఖండ 2” సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ చుట్టూ ఇప్పటికే క్రేజ్ చాలా ఎక్కువ. ఇప్పుడు అందులో బాలయ్య గారి లుక్‌లపై ఇంట్రస్టింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి.
ఇప్పటివరకు అందరికీ తెలిసినట్టు, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారని చెప్పబడింది. అయితే ఇప్పుడు చర్చల్లో ఉన్నది ఏంటంటే, బోయపాటి శ్రీను బాలయ్యకి మరో ప్రత్యేకమైన లుక్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఈ కొత్త గెటప్ కూడా ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ మూడవ లుక్ ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి, కానీ ప్రస్తుతానికి మాత్రం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్‌లోనే ఫస్ట్ లుక్ తో పాటు టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు 14 రీల్స్ సంస్థ చేపట్టింది.
