ఫుల్‌ స్వింగ్ లో అఖండ 2..!

Monday, December 8, 2025

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ జోడీ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2 తాండవం’పై అభిమానుల్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. గతంలో అఖండ ఇచ్చిన విజయానంతరం వీళ్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు చాలాఏక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొన్ని క్లైమాక్స్ స్థాయి సన్నివేశాలు చిత్రీకరణలో ఉండగా, ఇటీవల నది దగ్గర ఓ ప్రత్యేక సన్నివేశాన్ని రూపొందించారట. అందులో బాలయ్య స్వయంగా ప్రవాహంలోకి దిగినట్టు సమాచారం. ఆయన చేస్తున్న యాక్షన్ స్టైల్, సినిమాకు కావాల్సిన మాస్ ఫీలింగ్‌ని మెరుగుపరచేందుకు ఇలాంటి రిస్క్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ వృత్తాంతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నాడు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే కొన్ని షూటింగ్ లొకేషన్లలో వినిపించగా, అభిమానుల్లో మంచి అంచనాలు పెంచింది. నిర్మాణం బాధ్యతలను 14 రీల్స్ సంస్థ తీసుకుంది. నిర్మాణంలోనే కాదు, ప్రమోషన్ల విషయంలోనూ పూర్తి స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తోంది.

‘అఖండ 2 తాండవం’ చిత్రాన్ని సెప్టెంబర్ 25న భారీగా అన్ని భాషల్లో విడుదల చేయడానికి సిద్ధంగా చేస్తున్నారు. తొలి భాగం చూపించిన మాస్ పవర్, రుద్ర తాండవం – ఇవన్నీ ఈ సీక్వెల్‌లో రెట్టింపు స్థాయిలో ఉండనున్నాయనే టాక్‌తో ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ నెలకొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles