ఫుల్‌ స్వింగ్‌ లో అఖండ 2….!

Andhrawatch
1 Min Read

నందమూరి నట సింహం బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్న సూపర్‌ హిట్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల  చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు.

 ఇక ఈ సినిమా తరువాత బాలయ్య తన  తరువాత సినిమాగా  ‘అఖండ-2’లో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేశారు.

అయితే, ‘అఖండ-2’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ వర్క్ ప్రస్తుతం శరవేంగా జరుపుకుంటుంది.థమన్ ఇప్పటికే ఈ సినిమా స్కోర్‌పై వర్క్ స్టార్ట్ చేశాడని.. ఇప్పటికే ఓ సాంగ్ కూడా పూర్తయ్యిందని ఆయన ఇటీవల తెలిపాడు. దీంతో ‘అఖండ-2’ మ్యూజిక్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో ఉందని మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో యాక్ట్‌ చేస్తుండగా… ఈ సినిమాలో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -
Share This Article