అఖండ 2’ ఎంట్రీ సీక్వెన్స్ పై

Saturday, January 18, 2025

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.  దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్, కీలక షెడ్యూల్ షూట్ కి సన్నాహాలు చేసుకుంటోంది.

బాలయ్య ఎంట్రీ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ కూడా వేస్తున్నారట. ఈ సీక్వెన్స్ లోనే అఖండ పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే, ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles