ప్రమాదం నుంచి బయటపడిన అజిత్‌!

Saturday, January 31, 2026

తమిళ స్టార్ హీరో అజిత్‌కు కారు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. ఆయన సమయం దొరికినప్పడుల్లా కారు, బైక్ రేసింగ్‌లలో పాల్గొంటారు. అయితే, తాజాగా అజిత్ ఓ పెద్ద  కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దుబాయ్‌లో జరగనున్న 24H దుబాయ్ 2025 కారు రేసింగ్ పోటీల్లో అజిత్ పాల్గొననున్నాడు.

దీనికి సంబంధించి ఆయన కారు రేసింగ్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే, అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారు కంట్రోల్ తప్పడంతో అది క్రాష్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఆయన ఈ ప్రమాదం నుంచి క్షేమంగా  బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఏదేమైనా రిస్క్ చేయడంలో అజిత్ ఎప్పుడూ ముందుంటాడని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక అజిత్ నటించిన ‘విదాముయార్చి’ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్దంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles